calender_icon.png 28 April, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కుల కమిషన్‌కు మంచిపేరు తీసుకురావాలి

28-04-2025 01:37:10 AM

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసి కమిషన్‌కు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి, సభ్యులు ఆదివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీతక్కకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఇటీవల బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు మంత్రి సీతక్కతో తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులను సీతక్క అభినందించారు.