ప్రభుత్వం తరఫున రెండు లక్షల చెక్కును అందజేసిన అదనపు కలెక్టర్...
తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించి 45 రోజుల పసికందు మృతి చెందింది. దాసరి రమేష్ తల్లి లలిత 45 రోజుల పసికందును స్థానిక నేరెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం తీసుకువచ్చారు. టీకా వేసిన గంట తర్వాత చిన్నారికి జ్వరం రావడంతో చిన్నారిని సిరిసిల్ల ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందని వైద్యులు నిర్ధారించినట్టు తల్లిదండ్రులు విలపించారు. నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నేరెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సై రామ్మోహన్ హాస్పిటల్ కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న బాధితుల వివరాలు సేకరించి ఆసుపత్రి సిబ్బందిపై చేసిన ఆరోపణలపై తగిన విచారణ చేసి సమగ్ర దర్యాప్తును సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తగు న్యాయం చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఆమె వెంట తహసిల్దార్ జయంతు ఉన్నారు.