calender_icon.png 1 April, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దద్దరిల్లిన ముఖ్యమంత్రి సభ

31-03-2025 01:48:27 AM

భారీగా తరలిన వచ్చిన ప్రజలు

హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ

సూర్యాపేట, మార్చి30, (విజయక్రాంతి), హుజుర్‌నగర్:  రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణి ప్రారంభంలో భాగంగాసూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో నిర్వ హించిన ముఖ్యమంత్రి సభ విజయవంతంమైనది. సభకు జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా కోదాడ, హుజుర్నగర్ నియోజకవర్గాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరైనారు.

సుమారు 30 వేల మంది వచ్చే అవకాశం ఉన్నదని అంచానా వేసిన.. 50 వేలకు పైగా ప్రజలు హాజరైనారని తెలుస్తోంది. దీంతో సభా ప్రాంగణం దద్దరిలింది. ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి సన్న బియ్యం పంపిణి ప్రారంబించారు. హెలికాప్టర్ ద్వారా హుజుర్నగర్ వచ్చిన ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గలో హైద్రాబాద్ కు వెళ్లారు. 

 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

హుజుర్‌నగర్‌కు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీతారామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర మంత్రులు, ఉత్తమ్కుమార్రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అద్యక్షులు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి ప్రారంబించారు.

స్వాగతం పలికిన కలెక్టర్

జిల్లాకు వచ్చిన రా్రష్ట్ర  ముఖ్యమంత్రి రేవత్రెడ్డికి హుజుర్నగర్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవారం స్వాగతం తెలిపారు. అనంతరం అభిమానులు సన్నాయి మేళంతో స్వాగతం పలికారు. డప్పు కళాకారులు, బిందెలతో బంజారా కళాకారులు తమ కళలతో స్వాగతం పలికారు. 

స్వయం సహాక సంఘాలకు చెక్కుల పంపిణి

హుజుర్‌నగర్‌లో నిర్వహించిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం సభా వేదిక నుంచి  కోదాడ, హుజుర్నగర్ నియోజక వర్గాల మహిళా సంఘాలకు రూ. 26.16 కోట్ల విలువగల చెక్కును అందించారు. 

సన్న బియ్యం అందుకున్న లబ్దిదారులు వీరే...

ఉగాధి కానుకగా పేదలకు పన్న బియ్యం పంపిణి ప్రారంబించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్రెడ్డి హుజుర్ నగర్ వేదికపై పది మంది లబ్దిదారులకు తన చేతుల మీదుగా సన్న బియ్యం బ్యాగులను అందించారు. సీఎం చేతుల మీదుగా సన్న బియ్యం అందుకున్న వారిలో  దరావత్ బుజ్జీ, మాలోతు రంగా, కర్ల రాధ, చాడపంగు లక్ష్మి, షేక్ రెహ్మా న్, షేక్ కరీమా, కర్పూరపు లక్ష్మి, గుండెబోయిన గురువమ్మ, చిరుమామిళ్ల సుశీల, కర్నే వెంకటపుష్పలు ఉన్నారు. 

శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్, కౌన్సిల్ చెర్మెన్ సుఖేందర్రెడ్డి,  మంత్రిలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీదర్బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు  పద్మావతి, లక్ష్మారెడ్డి, మందుల సామెల్, వేముల వీరేషం,  బీర్ల ఐలయ్య, బాలు నాయక్, అనిల్కుమార్, శ్రీహరి,  ఎంపిలు రఘువీర్రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ యాదవ్, టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ పటే ల్ రమేష్రెడ్డి,  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.