11-12-2024 01:26:55 AM
విగ్రహం తయారు చేసి, వినతిపత్రం అందజేత
నిర్మల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): విద్యాశాఖలో పని చేస్తున్న సర్వశిక్ష అభియా న్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టి న సమ్మె మంగళవారం 5వ రోజుకు చేరింది. అయితే, కుబీర్ మండలంలో క్రాఫ్ట్ టీచర్‌గా పనిచేస్తున్న సాయిశ్యామ్ 15 రోజులు కష్టప డి సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహాన్ని తయారు చేశారు.
ఆ విగ్రహాన్ని ఉద్యోగులు ప్రతిష్టించి, మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు తమ కు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరు తూ వినతిపత్రాన్ని ఆ విగ్రహానికి అందజేశా రు. వీరి ఆందోళనకు పలు ఉపాధ్యాయ సంఘాలు సంఘీబావం తెలిపాయి.