డీజేహెచ్‌ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి
హైదరాబాద్, సెప్టెంబర్1 (విజయక్రాం తి): జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయం లో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ9 (డీజేహెచ్‌ఎస్) అధ్యక్షుడు బొల్లోజు రవి తెలిపారు. ఈ నెల 8న జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో తమకు కూడా నిర్ణీత సమమయంలో ఇంటి స్థలం ఇచ్చేలా ప్రకటన చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఆదివా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన డీజేహెచ్‌ఎస్ జనరల్‌బాడీ సమావేశంలో తీర్మా నం చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టాలని విజ్ఞప్తి చేయడంతో మేనిఫెస్టోలో చేర్చారని ఆయన తెలిపారు.
రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక కూడా తమ సంఘం నుంచి పలుమార్లు కలిశామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని కూడా కలిసి ఇళ్ల స్థలాల అంశాన్ని విన్నవించామని రవి పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్‌రెడ్డి, రామకృష్ణ, నాగరాజు, సలహాదా రు విక్రమ్, సభ్యులు సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.