calender_icon.png 21 September, 2024 | 8:12 PM

బడ్జెట్‌పై ముఖ్యమంత్రికి అవగాహన లేదు

28-07-2024 12:21:58 AM

  1. కొడంగల్‌కు రూ.4,600 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్‌కు మెదక్ గుర్తు రాలేదా
  2. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు  

మెదక్, జూలై 27 (విజయక్రాంతి): కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. శనివారం కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో కలిసి మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, తెలంగాణకు కూడా నిధు లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సుమారు రూ.50 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌లో పేర్కొన్నారని, సీఎంకు అర్థం కాకపోతే ఏం చేయలేమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు ఉందా అని అడుగుతున్న సీఎం రేవంత్.. రాష్ట్ర బడ్జెట్‌లో కొడంగల్‌కు 4,600 కోట్లు కేటాయింపు చేసుకున్నాడని, మరి మెదక్ జిల్లాకు ఒక్క పైసా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర మంత్రికి సమస్యలు పరిష్కరించాలని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.