calender_icon.png 25 November, 2024 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచె తగిలి.. గాయాలపాలై చిరుత మృతి

29-08-2024 04:02:41 AM

కామారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): చెరుకు పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగలి చిరుత మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్‌లో బుధవారం వెలుగు చూసింది. పా రెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు చెరుకు పంట సాగు చేస్తున్నాడు. పంటకు వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు కంచె ఏర్పాటు చేశాడు.

ఈ క్రమంలో ఇటీవల ఆ కంచెకు చిరుతపులి తగిలి తీవ్ర గాయాలతో మృతిచెందింది. తనపై కేసు అవుతుందేమోమాన ని భయపడిన రైతు చిరుత కళబేరాన్ని గుట్టుచప్పుడుకాకుండా పాతిపెట్టాడు. విశ్వసనీ య సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చిన అటవీశాఖ అధికా రులు రైతును విచారించారు. రైతు చిరుతను పాతిపెట్టిన చోటుపై ఆరా తీశారు. తర్వాత పాతిపెట్టిన చోట తవ్వి చిరుత కళేబరాన్ని బయటకు తీశారు. అక్కడే పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.