* శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
* రథోత్సవానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ముడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాజరు
* వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
మహబూబ్ నగర్, జనవరి 13 (విజయ క్రాంతి) : అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు మన్యంకొండ పై వైభవంగా జరిగాయి. ఈ ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాల య పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిట లాడాయి. తేరు, కోనేరు మైదానాలు, ఘాట్ రోడ్లు మొత్తం గోవింద నామస్మరణతో మార్మోగాయి.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్టాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుం టున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా ఘ పౌర్ణమిని పురస్కరించుకుని, గరుడ వాహన సేవ, స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. కొండపై నుంచి స్వామి వారిని మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నిర్వహిస్తూ, గరుడ వాహనంలో భక్తుల మధ్యకు తీసుకొచ్చారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ప్రశాం తంగా స్వామి వారిని దర్శించుకొని మంచి అనుభూతితో తిరిగి వారివారి గమ్యస్థానా లకు క్షేమంగా వెళ్ళేందుకు క్షేత్రస్థాయిలో అందరూ పనిచేయాలని సూచించారు.
భక్తులకు మీరు చేసే సేవలు శ్రీ లక్ష్మీ వేంకటే శ్వర స్వామి వారికే చెందుతాయని ఆయన చెప్పారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికా రులకు, ఆలయ కమిటీ సభ్యులకు సూచిం చారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మ న్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులకు, అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేం దిర బోయి, జిల్లా ఎస్పీ డి జానకి, ఆలయ కమిటీ చైర్మన్ అలహరి మధుసూదన్, గ్రం థాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, గోవింద్ యాదవ్, నాయకులు జాజిమొగ్గ నరసింహులు, పాపారాయుడు, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, మల్లు అనిల్ రెడ్డి, మన్యం కొండ దేవస్థానం పాలక మండలి సభ్యులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.