11-04-2025 12:40:28 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 10 : జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామ నవమి నుంచి ఐదు రోజుల పాటు సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్వర్యంలో వైభవంగా జరిగాయి. సీతారామలక్ష్మణులు రథోత్సవంపై గ్రామంలోని నాలుగు వీధుల్లో ఊరేగారు.
ఈ ప్రధాన ఘట్టాన్ని వీక్షించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మంగంపేట గ్రామానికి భారీగా హాజరయ్యారు. కోలాటాలు, భజన పాటలతో రథోత్సవం ఆధ్యంతం శోభాయమానంగా జరిగింది. రథోత్సవానికి మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గంగురమేశ్, నాయకులు వెంకటేశంగౌడ్, గోవర్దన్ రెడ్డి, రాజేశ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, రామక్రిష్ణ, జగన్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
రథోత్సవానికి హాజరైన నేతలను ఆలయ కమిటీ చైర్మన్ పంబాల గణేశ్ సత్కరించారు. జిన్నారం ఎస్‌ఐ నాగలక్ష్మి ఉత్సవాలలో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ లు మల్లేశ్, జయప్రకాశ్, ప్రశాంతినరేందర్, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, నాయకులు సత్యనారాయణ, రామ్మూర్తి, కత్తుల రవి, రఘు, శ్రీకాంత్ గ్రామస్తులు భారీగాపాల్గొన్నారు.