calender_icon.png 22 January, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరుల స్మారకాలకు ప్రతీక చంపుడు గుడి

22-01-2025 12:39:36 AM

ఏదైనా తవ్వకాలు చేపట్టినప్పుడు  కొన్ని పురాతన గుళ్ళు బయటపడుతున్న సంఘటనలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నో పురాణాలు, ఆలయాలు ఉన్న జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ శివార్లలో ఉన్న వీర్లగడ్డపై చంపుడు గుడి ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు గుర్తించారు. చంపుడు గుడి ఆచారం రెడ్డిరాజుల కాలంలో మొదలైనట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

దైవ ప్రీతి కోసం స్త్రీ, పురుషులు ఆత్మహత్య చేసుకునేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని వీర భక్తిగా పిలుస్తారు. స్వచ్ఛందంగా మరణించాలని నిశ్చయించుకున్నవారిని చంపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఉండేవి. మరణించిన వీరుల స్మారకాలను ఇక్కడ ప్రతిష్టించేవారు. కాకతీయుల కాలంలో ‘వీర భక్తి’ ఆచారం కోసం ప్రత్యేకంగా శివాలయాలు నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు గుర్తించారు.