calender_icon.png 22 February, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీనాక్షి ఎదుట సమస్యల సవాళ్లు

18-02-2025 01:25:50 AM

  1. అంతర్గత విభేదాలకు కళ్లెం పడేనా? 
  2. ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు? 
  3. ‘స్థానిక’ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేదెలా?

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ వ్య వహారాల ఇన్‌చార్జ్‌గా నియమితురాలైన మీనాక్షినటరాజన్‌కు సమస్యల సవాళ్లు ఎదురుకానున్నాయి. పార్టీ లో అంతర్గత సమస్యలు, నేతల మ ధ్య విభేదాలు, అసంతృప్తులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆశావహుల పైరవీలు.. ఇలా ఎన్నో రకాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించా ల్సి ఉంది.

అలాగే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంతో మంది నేతలు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపా రు. వారిలో కొందరిపై నాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. మీనాక్షి నటరాజన్ వారందరికీ బాసటగా నిలు స్తూ, వారిని ఆయా కేసుల నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పేచేయి సాధించేందుకు మీనాక్షి నటరాజన్ పార్టీ శ్రేణు లను సిద్ధం చేయాల్సి ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ రాష్ట్రంలో ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలిపించుకోవాల్సి ఉం ది.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రా ష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో పార్టీ సోషల్‌మీడియా అంతంతమాత్రంగా పనిచే స్తుందనే విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు బదులిచ్చేందుకు, ఆరోపణలను  తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకోవడం లేదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.

కొత్త ఇన్‌చార్జి ఇక ముందైనా ఈ అంశా న్ని పరిగణలోకి తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ నాక్షి పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షకురాలిగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో కీలక పాత్రపోషించారు. ఆ అనుభవాలన్నీ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగ పడతా యని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.