బ్లుండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): స్పోర్ట్స్ కోటా తరహాలోనే డీఎస్సీ దివ్యాంగుల కోటాలో టీచర్ పోస్టులకు ఎంపికైన విజువల్లి చాలెంజ్ (వీహెచ్ అభ్యర్థుల సర్టిఫికుట్లను పునఃపరిశీలించాలని బ్లుండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బెంకి రాఘవేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
అంధ అభ్యర్థుల ధ్రువపత్రాలను విద్యాశాఖ మరోసారి పునఃపరిశీలించా లని కోరారు. టీఆర్టీ వీహెచ్ విభాగంలో ఉద్యోగం పొందిన వారిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా కొంత మందివి నకిలీ ధ్రువపత్రాలుగా అప్పట్లో గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. దివ్యాంగ కోటాలో ఎంపికైన వారందరికీ మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలను ఈ సారి నిర్వహించలేదని తెలిపారు.
దీంతో డీఎస్సీ కొందరు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలు సమర్పించి దివ్యాంగుల కోటాలో ఉద్యో గాలు పొందినట్టు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన దివ్యాంగ వీహెచ్ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగేలా అధికారులు చూడాలని విజ్ఞప్తిచేశారు. ఒకవేళ నకిలీ అభ్యర్థులని తేలితే వారిని తొలగించి తర్వాత మెరిట్ అభ్యర్థులతో పోస్టులు నింపాలని కోరారు.