26-04-2025 01:07:12 AM
అడ్వకేట్ జేఏసీ చైర్మన్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి
ఉగ్రదాడిపై రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన
ముషీరాబాద్, ఏప్రిల్ 25: కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని తెలంగాణ న్యాయవాదులు ఖండించారు. అడ్వకేట్ జేఏసీ చైర్మన్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు నిరసన తెలిపారు. పాకిస్తాన్ ముర్దాబాద్.. సేవ్ కాశ్మీర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపేంద్ర రామచంద్రరావు, సత్యనారాయణరెడ్డి, విప్లవరెడ్డి, ప్రదీప్, నరేష్, రాజేశ్వరరావు చంద్రశేఖర్, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.