సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు
సూర్యాపేట, నవంబర్ 30 (విజయక్రాంతి): దేశ ప్రజల సంపదను అప్పనంగా అంబానీ, అదానీలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దోచిపెడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ జిల్లా నాయకులు నెమ్మాది భిక్షం, మట్టిపెల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా మహాసభల్లో ఆయన మాట్లా డారు.
కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్, రాజ్యాంగాన్ని పొగుడుతూనే రాజ్యంగంలోని మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి వాటిని తుంగ లో తొక్కుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్ధాలను నేరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు పండగని అంటున్నారని అయితే ఆయన రైతులకు ఇచ్చిన హామీలను అమలు జరిగినప్పుడే పండగ అవుతుందన్నారు. ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు నాగా ర్జునరెడ్డి, జిల్లా నాయకులు కోట గోపి పాల్గొన్నారు.