calender_icon.png 13 March, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి

12-03-2025 12:42:21 AM

రైతు సంఘాల  డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 11 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభు త్వం గత 3 సంవత్సరాల క్రితం రైతులకు వ్యతిరేకంగా, బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని.

రెండు సంవత్సరాల పాటు ఢిల్లీలో అనేక రాష్ట్రాల నుంచి రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమం చేయగా. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని రాతపూర్వకంగా రైతు సంఘాలకు హామీ ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని విరమింప చేసిందని మళ్లీ అదే చట్టాలను అమల్లోకి  కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసా యిదా చట్టం పేరుతో చిన్న, చిన్న కారు రైతు లను వీధిన పడేసే దుర్మార్గమైన చర్యలకు బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తేర తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫారస్ ప్రకారంగా రైతాంగానికి అనుకూ లంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి ఆమో దించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్ర మంలో సిపిఐ, సిపిఐ ఎం, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులు: నిమ్మల రాంబాబు, జాటోత్ కృష్ణ ,కల్లూరి కిషోర్, గోకినపల్లి ప్రభాకర్, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న, బాణోత్ ధర్మ, కొండెబోయిన వెంకటేశ్వర్లు, శనిగరపు శ్రీనివాస్, కోటి నాగేశ్వరరావు, ఏ వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, ఊకంటి రవి, కోబల్, అజ్మీర బిచ్చ, నకిరేకంటే నాగేశ్వరావు, ఎర్రగొర్ల రామారావు, ఈసం అశోక్, తాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు