21-03-2025 12:33:12 AM
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్ నగర్ మార్చి 20 (విజయ క్రాంతి) : కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం బెంగుళూరు లోని ప్యాలెస్ గ్రౌండ్ హోటల్ లో నిర్వహించిన ఓబీసీ సమావేశంలో ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రివి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు.
కేంద్రం కుల గణన చేస్తేనే ఎవ్వరి వాట ఎంత అనేది తెలుస్తుందన్నారు. దేశ భవిష్యత్తు మారాలన్న, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కుల గణన చేయాల్సిన అవసరం ఉందన్నారు.దేశంలో చాలా రాష్ట్రాల బీసీల రిజర్వేషన్ ల బిల్లులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని.
బీసీల ప్రయోజనాలకు చెందిన బిల్లులను ఆమోదం తెలిపే బాధ్యత బిజెపి ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఉభయ సభల నుండి తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని, బిజెపి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును చట్ట సవరణ చేసి 42శాతం రిజర్వేషన్లను ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. అప్పుడు మాత్రమే ఏ పార్టీకి బీసీలపైన ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.