27-03-2025 04:32:27 PM
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఖానాపూరి ఇంచార్జి ఏంబటి రాజేశ్వర్, అయ్యన్న గారి పోశెట్టి..
ఖానాపూర్ (విజయక్రాంతి): గడచిన పది సంవత్సరాల కాలం నుంచి, కేంద్రంలో అధికారంలో ఉన్న, బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తుందని, జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఖానాపూర్ ఇన్చార్జీలు ఏంబటి రాజేశ్వర్, అయ్యన్న గారి పోశెట్టిలు అన్నారు.
ఈ మేరకు గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, వారు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిజ్ఞ అనంతరం వారు మాట్లాడుతూ... భారతదేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందని, దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా సిద్ధపడాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నిర్మల్ ఇంచార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, ఇప శ్రీనివాస్ రెడ్డి, ఆమంద శ్రీనివాస్, నాయకులు షౌకత్ పాషా, కావలి సంతోష్, నారాయణ రెడ్డి, గంగాధర్, రాజు నాయక్, జంగిలి శంకర్, మడిగల గంగాధర్, లక్ష్మీపతి గౌడ్, రాజేశ్వర్, మధిర సత్యనారాయణ, మీర్జా, సజ్జు, శేషాద్రి, నరసయ్య, రమేష్, దాసరి రాజన్న, శ్రీనివాస్ నాయక్, నరేష్, ఎడ్ల రాజేందర్, రమాదేవి, తారాబాయి, వసంత తదితరులు ఉన్నారు.