calender_icon.png 19 April, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానికి తూట్లు పోడుస్తున్న కేంద్ర ప్రభుత్వం

10-04-2025 12:12:03 AM

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి 

తాంసి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): భార త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో భాగం గా తాంసి మండలంలో చేపట్టిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తో కలిసి వడ్డడి నుండి జామిడి గ్రామం వరకు బుధవారం పాదయాత్ర కొనసాగించారు. ఈసందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్,  మహాత్మా గాం ధీల వారసత్వాన్ని కాపాడుతూ ముందుకు సాగుతోందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడిచి, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చేలా కుట్రలు చేస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నారాయణ, నాయకులు శ్రీధర్ రెడ్డి, సంతో ష్, నరేష్, వెంకట్ రెడ్డి, రామన్న యాదవ్, వెంకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.