24-03-2025 12:52:07 AM
రాజ్యంగాన్ని నిర్వీర్యం చేస్తూ హక్కులను హరించే కుట్రలో భాగమే అంబేద్కర్‌ని అవమానించడం
దేశ వ్యాప్తంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యంగాన్ని పరిరక్షిస్తుంది
హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ
హనుమకొండ, మార్చి 23 (విజయ క్రాంతి): ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వా మ్యం కలిగిన భారతదేశం బలమైన రాజ్యం గా విలువలతో కూడిన అభివృద్ధి చెందిన దేశమని హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసన సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి , ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.
ఆదివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పిలుపుతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ, కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రెండు జిల్లాకు ఇంచార్జ్‌లుగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాయ ల నాగేశ్వర్ రావులను నియమించారు. ఈ సన్నాహక సమావేశంలో పరకాల నియోజకవర్గ శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి , KUDA (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ద్వారా దేశ ప్రజలలో సమానత్వం, సౌబ్రతుత్వం పట్ల పాదయాత్ర చేసి దేశ ప్రజలను చైతన్యవంతం చేశారని గడిచిన 11 ఏళ్లుగా రాజ్యాంగాన్ని రాజ్యంగా విలువలని కాలగర్భంలో కలిపేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే నాయి ని మండిపడ్డారు.
జనవరిలో పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన ప్రసంగంపై దేశవ్యాప్తంగా ప్రశ్నించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని అన్నారు. రాజ్యంగా విలువలని గౌరవించే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని తెలిపారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే మన దేశంలో మతకల్లోలాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పట్ల దేశ నలుమూలల నుంచి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మన దేశ భవిష్యత్ కోసం మన నినాదమని అన్నారు. మండల స్థాయి,గ్రామ స్థాయి,డివిజన్ లలో మనమంతా ఒక్కటే రాజ్యాంగం మన హక్కుల పరిరక్షణకు కొరకు నిలువుటద్దమని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ నెలలో పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామాన పర్యటిస్తూ రాజ్యంగా విలువలని కాపాడేలా ప్రజలను మరింత చైతన్యవంతులని చేయాలని పిలుపునిచ్చారు. నూతన పార్టీ వ్యవ హారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ విధేయతకు కట్టుబడి ఉన్నారని వారి ఆదర్శాలను, ఆదేశాలను పాటిస్తూ పార్టీ పరంగా పిలుపునిచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ద్వంద విధానాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ వీడియోని ఈ సందర్భంగా తిలకించారు.
సమావేశ అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో హనుమకొండ,వరంగల్ జిల్లాల మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.