04-04-2025 12:25:29 AM
- కోహెడ మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర
సిద్దిపేట, ఏప్రిల్ 3(విజయక్రాంతి):అధికార అహంతో రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అవహేళన చేస్తున్నదని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేట జిల్లాలో కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య, సీనియర్ నాయకులు బసవరాజ్ శంకర్ తో కలిసి కోహెడలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో అత్తు ఇమామ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ అవలంబిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా మరుస్తుందన్నారు.
అందరి సమ్మతితో ఆమోదింపజేసి అమలులోకి తీసుకువచ్చిన రాజ్యాంగం పట్ల అధికార అహంతోనే బిజెపి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తున్నదన్నారు. అదే జరిగితే బడుగు బలహీన వర్గాల ప్రజలకు, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలు ఇప్పుడైనా మేల్కొని మన హక్కులను మనం కాపాడుకునేలా ప్రతి ఒక్కరు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి, యూత్ కాంగ్రెస్ శివ సాయి, సీనియర్ నాయకులు రాగుల శ్రీనివాస్, గయాజుద్దీన్, హర్షద్, బాబూ తదితరులు పాల్గొన్నారు.