calender_icon.png 11 March, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

11-03-2025 12:28:37 AM

మునగాల, మార్చి 10 ః కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం రాష్ర్ట నాయకులు, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేలమర్రి,ఈధులవాగు తండా గ్రామాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం  మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ భవనంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ అమలు చేసి రైతులను ఆదుకోవాలి అయన కొరారు .ఎండిన పంట పొలాలకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎండిన పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  స్వరాజ్యం, చందా చంద్రయ్య,  వీరబోయిన వెంకన్న. బట్టుపల్లి ఉపేందర్, మండవ వెంకటాద్రి, సురభి వెంకటనారాయణ,గోపయ్య, కృష్ణ రెడ్డి, బ్రహ్మం, డిలైఎఫ్‌ఐ,ప్రజా సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.