calender_icon.png 4 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై కేంద్రం సవతి ప్రేమ

04-02-2025 12:00:00 AM

కాంగ్రెస్ నిరసన.. ప్రధాని, ఆర్థిక మంత్రి దిష్టిబొమ్మల దగ్ధం 

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) ః బడ్జెట్ లో మరోసారి కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపించిందని యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి నుండి బిజెపి పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ మన రాష్ర్టంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శిం చారు.

టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నాడు అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ  పక్షపాత వైఖరిని అవలంబిస్తున్న నరేంద్ర మోడీ సర్కార్ కు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టి పి సి సి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, టిపిసిసి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ ఉద్దీన్ గోరి, మాజీ టౌన్ అధ్యక్షులు మున్సిపల్ ఫోర్ లీడర్  కే సోమయ్య , సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి పిట్టల బాలరాజు, మాజీ కౌన్సిలర్లు, ఈరోపాక నరసింహ, సలావుద్దీన్,  కరెంకొండ వెంకటేష్, భువనగిరి మండలం పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిగిల్ల బాలయ్య, యాదగిరి, గుమ్మడల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు బర్రె నరేష్, వాసుదేవ రెడ్డి, ఎండి జలీల్ ఎండి కరీం,  పార్టీ రాష్ర్ట, జిల్లా, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు  పాల్గొన్నారు.