తక్షణ సహాయం ప్రకటించాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్,సెప్టెంబర్2(విజయ క్రాంతి): భారీ వర్షాలతో తెలంగాణ తీవ్ర నష్టపోయిందని, ఈ కష్టకాలంలోనైనా కేంద్రం స్పందించి తక్షణ సహాయం ప్రకటించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ కోరారు. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ.. పరిస్థితులను ఎప్పటికిప్పుడు తెలుసుకుంటున్నారన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మానిటరింగ్ చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ బురద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వర్షాల కారణంగా పలు జిల్లాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ సహకారాలు చేస్తుందన్నారు. ఇవేమీ చూడ కుండా బీఆర్‌ఎస్ పారీ లీడర్లు విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అండగా నిలవాలని కోరారు.