calender_icon.png 4 February, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం తీరు మార్చుకోవాల్సిందే

04-02-2025 01:14:11 AM

  • తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు 
  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని కేంద్రం తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి మధుసూ దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవా రం జిల్లా కేంద్రంలో కేంద్ర బడ్జెట్లో తెలంగా ణపై వివక్ష చూపి, నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా ట కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం.

శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మె ల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే జియంఆర్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బీహార్ కు, ఢిల్లీకి, బిజెపి పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించి, తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ ెదా, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణకు బడ్జెట్?లో నిధులు.

కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల ను స్వయంగా కలిసి విన్నవించిన బడ్జెట్ లో కనీసం వాటి పేరును కూడా ప్రస్తావించ కపోగా, రాష్ర్ట ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం బుట్ట దాఖలు చేసిందని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.8 మంది బిజెపి ఎంపీ లు రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని, ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా విషయం, జిల్లాకు సంబం ధించిన విషయాలు గాలికి వదిలేశారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తూ, జిల్లా ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేసిం దని మహబూబ్ నగర్ ఎంపీ తీరుపై ఎమ్మె ల్యే జిఎంఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓబేదుల్లా కొత్వాల్, మహబూ బ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మూఢ చైర్మన్ శ్రీ. లక్ష్మణ్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.