calender_icon.png 18 October, 2024 | 7:51 AM

ప్రొ.సాయిబాబా మరణానికి కేంద్రానిదే బాధ్యత

18-10-2024 01:00:58 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్,అక్టోబర్17(విజయ క్రాంతి): ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమ కుట్ర కేసుల్లో ఇరికించడంతోపాటు పదేళ్లు చీకటిగదిలో బంధించి చివరికి అనారోగ్యంతో ఆయన మరణించడానికి కేంద్ర ప్రభుత్వమే కార ణమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

గురువారం హైదరాబాద్‌లోని మౌలాలిలో ప్రొ ఫెసర్ సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా భార్య వసంత, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ప్రజాస్వా మ్యయుతంగా పేదల హక్కుల కోసం పోరాడటమే నేరమా అని ప్రశ్నించారు.

90 శాతం దివ్యాంగుడైన సాయిబాబాను మరణించేంత వరకు శిక్షించడం సమాజాన్ని కలచివేసిందన్నారు. సాయిబాబా మరణం పట్ల బీసీ సంక్షేమ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని తెలిపారు. జాజులతోపాటు బీసీ సంఘాల నాయకులు గణేశ్‌చారి, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, సదానందం ఉన్నారు.