calender_icon.png 27 November, 2024 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోంది

27-11-2024 01:36:23 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా డిసెంబర్ 1న సేవ్ డెమోక్రసీ పేరుతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో  మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడి దళిత, ఆదివాసీ, మైనార్టీలకు న్యాయం జరగాలని ఢిల్లీలో ఆందోళన చేయనున్నట్టు తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం జరుగుతుందన్నారు.