బడ్జెట్‌లో కేటాయింపులు నిల్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాజేంద్ర నగర్‌లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)పై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిం చింది. ఏటా కేంద్ర బడ్జెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థకు కేటాయింపులు జరిగేవి. అయితే 2025-26 బడ్జెట్‌లో ఎన్‌ఐఆర్డీకి ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది.
గ్రామీణాభివృద్ధికి కోసం ఈ సంస్థ అనేక అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందిస్తోం ది. ఈ సంస్థలో శిక్షణ పొందిన లక్షలాది మంది తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 70 కోట్లు ఇచ్చిన కేం ద్రం ఈసారి బడ్జెట్‌లో పైసా ఇవ్వలే దు.
ఫలితంగా 222 మంది ఉద్యోగులు, 300 మంది పించన్‌దారులకు జీతభత్యాలు ఇవ్వడం కూడా కష్టంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సంస్థ డీజీ నరేంద్ర కుమార్ ఢిల్లీలోని అధికారులకు సమాచారం అందించారు.