calender_icon.png 10 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రం..

30-12-2024 04:32:39 PM

సామాజిక న్యాయం కోసం ఎర్రజెండపాటి పోరాటం 

జనవరి 25న సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు సంగారెడ్డిలో ప్రారంభం 

సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య...

సంగారెడ్డి (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఎర్రజెండా అవసరం ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని కేవలం కిషన్ భవనంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతతత్వం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుందన్నారు. ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం కొత్త చట్టాలు తీసుకువచ్చిందని ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నది ఒక ఎర్రజెండా పార్టీని తెలిపారు.

రాష్ట్రంలో పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని పోరాటాలు చేస్తున్న పార్టీ మాది అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2023లో ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేసిందని, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకు న్యాయం చేయలేదు అన్నారు.

బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆర్టీసీలో కార్మికుల సమస్యలపై పోరాటం చేసేందుకు యూనియన్ లేకుండా చేసిన ప్రభుత్వం బిజెపి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఈనెల 25 నుంచి 28 వరకు సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మాసభలకు దేశంలోని సిపిఎం ముఖ్య నేతలు హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు మల్లికార్జున్, అడివయ్యా, నర్సింలు, మాణిక్యం తదితరులు ఉన్నారు.