11-04-2025 12:00:00 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ సర్కార్ ఇప్పటివరకు 9సార్లు పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులపై ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని, ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సగానికి సగం తగ్గిపోయినప్పటికీ భారతదేశంలో ధరలు పెంచడం దుర్మార్గమైన చర్యగా మహబూబాబాద్ జిల్లా సీపీఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పేర్కొన్నారు.
గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పెట్రోల్ ఉత్పత్తులపై ధరల భారం మోపడం వల్ల నిత్యవసర సరుకుల ధరలను కూడా పరోక్షంగా పెంచడమేనని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆకుల రాజు, అలవాల వీరయ్య, పాపారావు, సమ్మెట రాజమౌళి, దుడ్డేల రామ్మూర్తి, కుంట ఉపేందర్, పట్టణ ఒకటవ ఏరియా కార్యదర్శి రావుల రాజు, చీపిరి యాకయ్య, కుమ్మరి కుంట్ల నాగన్న, భీమా నాయక్, భాగ్యమ్మ, రమాదేవి, ఉపేంద్ర, యామగాని వెంకన్న, గౌని వెంకన్న, భానోత్ ప్రకాష్, బుక్య రాజేష్ పాల్గొన్నారు.