10-04-2025 12:00:00 AM
వంట గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం, సీపీఐ నిరసనలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా లో సీపీఎం, సీపీఐ పార్టీలు వేరువేరుగా నిరసనలు చేపట్టారు. పెంచిన ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కేఆర్‌కే కాలనీలో గ్యాసు సిలెండర్‌లతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ధర లు పెంచుతూ పేదల, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని, కార్పొరేట్, బడా వ్యాపారుల కోసం తాపత్రయ పడే బీజేపీ ప్రభు త్వానికి పేదల గురించి పట్టడం లేదన్నారు. మరోవైపు సీపీఐ పార్టీ, ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ ఆధ్వర్యంలో సైతం నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన చేస్తూ సిలెండర్‌లతో రాస్తారోకో చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు నళిని రెడ్డి, కుంటల రాములు, అరుణ్ కుమార్, మంజుల, ఆశన్న, నగేష్, అర్ఫా బేగం పలువురు మహిళలు పాల్గొన్నారు.