calender_icon.png 7 April, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన కేంద్రం..

07-04-2025 05:15:39 PM

న్యూఢిల్లీ: వంట గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్(LPG cylinder) ధరను కేంద్రం భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్ పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురీ(Union Petroleum Minister Hardeep Singh Puri) వెల్లడించారు. ఈ ధరల పెరుగుదల ఉజ్వల పథకం, జనరల్ కేటగిరీ(General category) వినియోగదారులకు వర్తిస్తుందని మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. తాజా పెరుగుదలతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ప్రతి సిలిండర్‌పై అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.