19-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మే 20న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎం.నరసింహ (ఏఐటియూ సీ), భూపాల్ (సిఐటియు), జి. రాజశేఖర్ (ఐఎన్‌టీయూసీ), డాక్టర్ జి.శాంతి కుమార్ (బిఆర్‌టీయూ) మాట్లాడారు. వైద్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్య ను పెంచాలన్నారు. అలాగే వైద్య రంగానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎం ప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.లక్ష్మీబాయి, తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫసీయుద్దీన్, నేతలు ఆర్.వెంకట్ నాయక్, కిరణ్మయి, భూలక్ష్మి, గిరి, యాదయ్య పాల్గొన్నారు.