30-03-2025 07:24:47 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహంకాళి అమ్మవారి మహోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గా దేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో ఏప్రిల్ 12, 13వ తేదీలలో జరిగే మహంకాళీ అమ్మవారి జాతర పోస్టర్లను ఆదివారం కోవ లక్ష్మి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్, ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, కమిటీ సభ్యులు కావుడే సంతోష్, శ్రీకర్ పాల్గొన్నారు.