calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈఐఆర్ పోర్టల్ వరం లాంటిది

17-04-2025 12:00:00 AM

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): సెల్‌ఫోన్ పోగుటుకున్న బాధితులకు  సీఈఐఆర్ పోర్టల్ వరం లాంటిదని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గత మూడు నెలల్లో  జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 50 మంది బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనుగోన్న ఫోన్ లను అందజేశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ  ఫోన్ పోగొట్టుకున్న , దొంగతనం జరిగిన వెంటనే బాధితులు మీ సేవ ద్వారా ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్‌లో  సంప్రదించాలని సూచించారు.ఈ సందర్బంగా బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణా ప్రతాప్, ఐటి కోర్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ లు సౌమ్య, తేజస్విని, కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు.