03-03-2025 06:33:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ఖానాపూర్ సిడిపిఓ విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడడంపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపిన దాన్ని బహిర్గతం చేయకపోవడంపై సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ మండిపడ్డారు. సిడిపిఓ తన కార్యాలయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డట్టు తాము ఆధారలతో సహా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన విచారణ పేరుతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. విచారణ అంశాలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగామణి చంద్రకళ రాజమణి పాల్గొన్నారు.