12-02-2025 12:00:00 AM
నల్లగొండ, ఫిబ్రవరి 11 (విజయక్రాం తి): రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే చారిత్రాత్మకమైందని మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కులగణన సర్వే పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. నల్ల గొండ జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యా లయంలో మంగళవారం మీడియాతో గు త్తా మాట్లాడారు. దేశంలో ఎక్కడా చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి , రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహించిందని పేర్కొన్నారు.
సర్వేలో 94, 863 ఎన్యుమరేటర్లు, 9,628 మంది సూపర్ వైజర్లు , 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్పంచుకొని 97 శాతం మంది వివరాలు నమోదు చేశారని వెల్లడించారు. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు తప్పని ఆరోపించడం సరికా దన్నారు. ఓటర్ జాబితాకు సర్వే లెక్కలకు తేడా ఉంటుందని, ఒక్కో వ్యక్తికి రెండుచోట్ల ఓటుహక్కు ఉండడమే ఇందుకు కారణమ ని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు సర్వే లెక్కలు తప్పుల తడ కని ఆరోపించడం సరికాదన్నారు.
రాజకీ యాల్లో నైతిక విలువలు పాటించాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. అరులందరికీ రేషన్ కార్డు లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద న్నారు. బీపీఎల్, ఏపీఎల్ కార్డులు ఇవ్వా లని సీఎంకు ఇప్పటికే తాను లేఖ రాశానని ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిం చారని తెలిపారు.
సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తనకు రాజకీయా లతో సంబంధం లేదని, పార్టీ ఫిరాయింపు లపై మాట్లాడబోనన్నారు. కుల , మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎవరు మాట్లాడినా తప్పేనని వ్యాఖ్యానించారు. మదర్ డైయిరీ ఆస్తుల విక్రయం సరికాదని, సంస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని గుత్తా కోరారు.