calender_icon.png 7 November, 2024 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణనలో కులగణనను పరిశీలించాలి

07-11-2024 12:25:30 AM

  1. కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి 
  2. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి 
  3. కులగణన అంశాన్ని గవర్నర్‌కు వివరించిన సీఎం 
  4. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): 2025లో దేశ వ్యాప్తంగా చేపట్టే జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం మంత్రులు, ఎంపీలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి వెళ్లి గవర్నర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశాన్ని గవర్నర్‌కు సీఎం వివరించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలను కులగణనలో సేకరిస్తున్న వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. కులగణన, మూసీ ప్రక్షాళనపై గవర్నర్ చర్చించారు. పేదలు నష్టపోకుండా పరిహారం అందించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి గవర్నర్ సూచించారు.

పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చినట్లు గవర్నర్‌కు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.  సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం  సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్‌అలీ, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్,  కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి,  రాజ్‌భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.