calender_icon.png 26 April, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులపై కేసీఆర్ పెట్టిన కేసులు ఎత్తివేయాలి

26-04-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి):  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అమరుల ఆశయాలను తుంగలో తొక్కి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ ఉద్యమకారుల గొంతులు నొక్కి, అక్రమ కేసులు మోపి జైళ్లలో నిర్బంధించి తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లో ముంచింది చాలక, మరోసారి నమ్మించి, తడి బట్టతో గొంతు కోయాలని చూస్తున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను నిరసిద్దాం అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రెటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, జేఏసీ నాయకులు చంద్రన్న ప్రసాద్ లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలం చెందాడని తెలిపారు.

ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని మాట్లాడిన, ప్రశ్నించిన ఉద్యమకారులపై ఊప కేసులు పెట్టీ నిర్బం ధించిన ఘన చరిత్ర కేసీఆర్ కి ఉందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కాలేదని, టిఆర్‌ఎస్ ను బిఆర్‌ఎస్ గా మార్చి వజ్రోత్సవం పేరుతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడనీ తెలిపారు. ఉద్యమకారులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆ సభకు వెళ్ళొద్దని కోరారు. కెసిఆర్ కుటుంబ ఆస్తులపై సిబిఐతో విచారణ జరపాలన్నారు. అక్రమ ఆ స్తులను ప్రభుత్వం జప్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగులతో కక్ష్య పూరితంగా తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన ’ఉపా’ కుట్ర కేసులను ఎత్తివేయాలన్నారు. ఈ సమావేశంలో వేముల యాదగిరి, కమ ల్, తదితరులు పాల్గొన్నారు.