calender_icon.png 26 October, 2024 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి

16-07-2024 12:05:00 AM

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్

ముషీరాబాద్, జూలై 15: తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై పెట్టిన పోలీసు కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్‌టెబుల్ సమావేశం తెలంగాణ ఉద్యమ సమితి నాయకుడు సుల్తాన్ యాదగిరి(యాదన్న) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 1969 ఉద్యమకారుడు బోయపల్లి రంగారెడ్డి, ఉద్యమకారులు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, కొండా స్వామి, సుదర్శన్, మల్లారెడ్డి, అన్వర్ పటేల్, రాధాకృష్ణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రావి వెంకట్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 4 గదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరారు. రూ.30 వేల గౌరవ వేతనం, ప్రతి నెలా పెన్షన్, ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా రూ.20 లక్షల వరకు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఉద్యమకారుల కుటుంబాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అమరవీరుల స్మృతి వనం 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ సమరయోధుల విస్కృత కమిటీని అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరారు.