బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తాజాగా ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారించింది. విచారణ అనంతరం మీడియా ముఖంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తమాషాగా అనిపించాయి. అంతకుముందు ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ తిప్పితిప్పి అడిగిందని, విచారణలో కొత్తదనం లేదంటూ ఆయన మాట్లాడారు.
కేసు ఒకటే అయినప్పుడు ప్రశ్నలు కూడా ఒకేలా ఉంటాయన్న లాజిక్‌ను కేటీఆర్ మిస్సయినట్లు కనిస్తోంది. మీడియాతో ఆయన మాట్లాడిన మాటల్లో దబాయింపు, మేకపోతు గాంభీర్యం తప్ప, ఎక్కడా నిజాయతీ కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా కేసు ఒకటే అయినప్పుడు, ప్రశ్నలు మరో విధంగా ఎందుకు ఉంటాయి రామన్నా.. ఈ మాత్రం మీకు తెలియదానే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కొడవలికంటి నవీన్