calender_icon.png 4 February, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీల్డ్ అసిస్టెంట్ పై కేసు వెనక్కి తీసుకోవాలి

04-02-2025 04:36:30 PM

మందమర్రి (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామపంచాయతీ పరిదిలోనీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో బాగంగా ఇటీవల జరిగిన ప్రమాదంలో తల్లి కూతుర్లు మరణించిన ఘటనలో ఫీల్డ్ అసిస్టెంట్ పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో బాగంగా పనులు జరుగుతుండగా ప్రమాద వశాత్తూ తల్లి కూతుర్లు మరణించడం బాధాకరమన్నారు.

పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు పనుల సందర్బంగా చెప్పడం జరుగుతుందనీ అస్తమా స్పష్టం చేశారు. కూలీలు తమ పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో ఫీల్డ్ అసిస్టెంట్ ను ముద్దాయిగా చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు వెంటనే స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్ మీద నమోదైన కేసును వెనక్కు తీసుకునేలా కృషి చేయాలని, ఇదే సందర్భంలో అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ కు తగిన న్యాయం చేయాలని కోరారు.