- టీటీడీ ఆ ఆలోచనను విరమించుకోవాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తిరుమల దర్శనంలో తెలంగాణ ప్రజలపై టీడీపీ ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అక్రమ కేసు నమోదు చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీలపై కేసులు పెట్టే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోందని, ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తిచేశారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడితే సహించమని హెచ్చరించారు.
గతంలో తెలంగాణకు చెందిన అగ్రకుల ప్రజాప్రతినిధులు టీటీడీ దర్శనానికి రాసిన సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై కొంద రు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుపై విమర్శనాత్మకంగా మాట్లాడారని గుర్తుచేశారు. వారి పై కేసులు పెట్టని టీటీడీ.. బీసీ నేతపై కేసు పెట్టాలని యోచించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.