- మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అనుచరుడు
- జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరితకు తప్పని భంగపాటు
- గద్వాల్‌లో మరింత వేడెక్కుతున్న రాజకీయం
గద్వాల(వనపర్తి), ఆగస్టు 31 (విజయక్రాంతి): గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరితకు ఘోర పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంతాన్ని నెగ్గించుకుని తన అనుచరుడు కుర్వ హనుమంతును మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమిచంపకున్నారు. 16 మంది సభ్యులను కూడా ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో గద్వాలలో రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి నుంచి వచ్చిన వారికి అవకాశం క ల్పించడం ప ట్ల సరిత అనుచర వర్గాల్లో తీవ్ర నైరాశం నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును సరిత వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మంత్రి తెరవెనుక చక్రం తిప్పారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.