కోర్టుకు తెలిపిన ముంబై పోలీసులు
ముంబై, జూలై 8 : మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసులో ఓ కీలక విషయం బయటపడింది. ప్రమాద సమయంలో మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) కారు నడిపినట్లు పోలీసులు సోమవారం ముంబై కోర్టుకు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి తన కుమారుడు మిహిర్ షాను తప్పించేందుకు డ్రైవర్ రాజ్ రిషి బిదావత్ డ్రైవింగ్ సీటుకు మారాల్సిందిగా రాజేష్ షా సూచించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షా పరారీలో ఉండగా.. నిందితుడి తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజ్‌రుషి బిదావత్‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రాజేష్ షాకు ఈనెల 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ, డ్రైవర్ బిదావత్‌కు ఒక రోజు పోలీసు కస్టడీ విధించింది.