* మెట్రో వర్కర్లపై నుంచి దూసుకెళ్లిన ఊర్మిల కారు
* ముంబైలో ఘటన
ముంబై, డిసెంబర్ 28: మరాఠీ నటి ఉర్మిల కొథారే ప్రయాణిస్తున్న కారు మెట్రో వర్కర్ల మీద నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఒక కూలీ చనిపోగా మరో కూలీకి గాయాలయ్యాయి. ఉర్మిల, ఆమె డ్రైవర్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ముంబైలోని కండీవల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఘటన
ఓ చిత్ర షూటింగ్ ముగించుకుని ఉర్మిల కొథారే తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాయిజర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చే సరికి ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌కు కంట్రోల్ కాలేదు. దీంతో కారు ఒక్కసారిగా మెట్రో వర్కర్ల మీదకి దూసుకెళ్లింది. ఇద్దరు మెట్రో వర్కర్ల మీద నుంచి కారు దూసుకెళ్లగా.. ఓ కూలీ ఘటనా స్థలంలోనే మరణించాడు. గాయాలతో ఉన్న మరో కూలీని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.