calender_icon.png 28 April, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొట్టిన కారును

15-04-2025 01:07:33 AM

  1. ముగ్గురు దుర్మరణం, ఇద్దరికి తీవ్ర గాయాలు 
  2. జనగామ జిల్లా రాఘవపురంలో ఘటన

రఘునాథపల్లి, ఏప్రిల్ 14: లారీని కారు ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపురం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ సూరారానికి చెందిన శ్రీనివాసు, అంత లక్ష్మి, అనూషతో పాటు మరో ఇద్దరు కారులో హనుమకొండకు వెళ్లి తిరుగుపయణమయ్యారు.

రాఘవపురం సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, అంత లక్ష్మి, అనుష అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి స్టేషన్‌ఘనపూర్ సీఐ వేణు, రఘునాథపల్లి ఎస్సై నరేష్‌యాదవ్ వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.