17-02-2025 10:53:34 PM
సిద్దిపేట (విజయక్రాంతి): వేగం అదుపుతప్పి కారు బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. హైదరాబాద్ కు చెందిన యువకులు ఆల్వాల గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. పొలం వద్దకి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రక్షిత్ 14 ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికీ తీవ్రగాయపడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.