calender_icon.png 17 January, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో అదుపుతప్పి కారు బోల్తా

16-01-2025 10:04:56 PM

స్వల్ప గాయాలతో బయటపడ్డ నిర్మల్ వాసులు

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సమీపంలోని జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లాకు చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. నిర్మల్ కు చెందిన శశిధర్ రావు తన కుటుంబ సభ్యులతో పాటు ముగ్గురు మహిళలు కారులో ప్రయాణం చేస్తున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేసరికి స్వల్ప గాయాలైన వారు వెంటనే వేరే కారులో నిర్మల్ వెళ్లారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. భిక్కనూర్ పోలీసులు బోల్తా పడిన కారును రోడ్డు పక్కకు జరిపారు. కారు స్పీడ్ గా వెళ్లడంతో అదుపుతప్పి రోడ్డుపై పల్టి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ పోలీసులు పేర్కొన్నారు.