calender_icon.png 16 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి కారు బోల్తా..

15-01-2025 10:36:22 PM

ఇద్దరికీ గాయాలు...

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్ వద్ద నిర్మల్ అదిలాబాద్ జాతీయ రహదారిపై బుధవారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. నేరడిగొండ మండలం వడూరు గ్రామం చెందిన అయ్యప్ప స్వామి నరసయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ కు బయలుదేరారు. అయ్యప్ప స్వామి మాలధారణ విరమించేందుకు కారులో వస్తుండగా ఉదయం ఐదు గంటలకు ఒక్కసారిగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న నరసయ్యతో పాటు ఒక బాలుడికి గాయాలు కావడంతో వారిని వెంటనే నిర్మల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.