calender_icon.png 16 January, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు

02-09-2024 02:16:31 AM

ముగ్గురికి తీవ్ర గాయాలు

కొండపాక, సెప్టెంబర్ 1: సిద్ధ్దిపేట జిల్లా రాజీవ్ రహదారి దుద్దెడ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును వెనుకనుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. నంగునూరు మండలంలోని పాలమాకులకు చెందిన నాగరాజు, నర్సిం హులు, లక్ష్మన్ జగదేవ్‌పూర్ మండలంలోని కొండపోచమ్మ దేవాలయా నికి కారులొ వెళ్తుండగా దుద్దెడ శివారులో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. దుద్దెడ టోల్‌గేట్ అంబులెన్సు సిబ్బంది బాధితులను సిద్ధ్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిద్ధ్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.